IPL 2023 : గుజరాత్‌పై ముంబయి సూపర్ విక్టరీ

by Rajesh |
IPL 2023 : గుజరాత్‌పై ముంబయి సూపర్ విక్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్య కుమార్ సూపర్ సెంచరీతో ముంబయి 219 టార్గెట్ ను గుజరాత్ ముందుంచుంది. 49 బంతుల్లో 103 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ జట్టుకు భారీ టార్గెట్‌ను అందించాడు. అయితే పరుగుల ఛేదనలో గుజరాత్ 13 ఓవర్లు ముగిసే సరికి 103/8 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ వన్ సైడ్ అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రషీద్ ఖాన్ సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. కేవలం 32 బంతులు ఆడిన ఈ అఫ్గాన్ ప్లేయర్ 79 పరుగులు చేశాడు. రషీద్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో గుజరాత్ 191 పరుగులు చేసింది. 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముంబయి బౌలర్లలో మధ్వాల్ 3, చావ్లా 2, కార్తికేయ 2, బెహ్రాన్ డార్ఫ్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో ముంబయి ప్లే ఆఫ్‌కు మరింత చేరువైంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్ ప్లేస్‌లో ఉండగా ముంబయి మూడో స్థానంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed