IPL-17 : పోరాడే స్కోరు చేసిన హైదరాబాద్.. ముంబై ముందు లక్ష్యం ఎంతంటే?

by Harish |
IPL-17 : పోరాడే స్కోరు చేసిన హైదరాబాద్.. ముంబై ముందు లక్ష్యం ఎంతంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌తో హైదరాబాద్‌ను నిలువరించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(48), కెప్టెన్ పాట్ కమిన్స్(35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ ఆ స్కోరైనా చేయగలిగింది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(20), అభిషేశ్ శర్మ(11), క్లాసెన్(2) తమ స్థాయి ప్రదర్శన చేయడంలో నిరాశపరిచారు. దీంతో హైదరాబాద్ పోరాడే స్కోరు మాత్రమే చేయగలిగింది. ముంబై ముందు 174 పరుగుల టార్గెట్ పెట్టింది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, స్పిన్నర్ పీయూశ్ చావ్లా మూడేసి వికెట్లతో సత్తాచాటారు.

Advertisement

Next Story