- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rohit Sharma: రోహిత్ శర్మ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే కెప్టెన్ గా తప్పించారట.. అసలు నిజం బయటపెట్టిన రాబిన్ ఉతప్ప..!
దిశ,ఫీచర్స్: 2024 IPL సీజన్‌కు రోహిత్ శర్మ స్థానంలో గుజరాత్‌కు చెందిన హార్దిక్ పాండ్యాతో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన తర్వాత ఇది మిస్టరీగా మిగిలిపోయింది. ఈ జట్టు అభిమానులు ముంబై ఇండియన్స్ చెప్పిన వాదనలను నమ్మలేదు. ఫలితంగా, చాలా మంది ముంబై ఇండియన్స్ అభిమానులు జట్టుకు వీడ్కోలు పలికారు,అలాగే సోషల్ మీడియాలో వారిని అన్‌ఫాలో చేశారు.
అయితే ముంబై ఇండియన్స్‌కు 5 టైటిళ్లు సాధించి మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎందుకు తీసివేయాల్సి వచ్చిందో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు. ఈ మార్పును ఎవరైనా మూడు కోణాల్లో చూడాలని అన్నారు. అందులో ఒకటి ముంబై కోణం కాగా, రెండోది హార్దిక్ పాండ్యా, మూడోది రోహిత్ శర్మ కోణం వైపు చుస్తే అర్ధమవుతుంది.
రోహిత్ ఆట తీరుపై, అతని గొప్పతనంపై తనకు ఎలాంటి సందేహం లేదని, అయితే అదే సమయంలో, ఫ్రాంచైజీ కోణంలో ఆలోచిస్తే 2020లో ముంబై టైటిల్‌ను గెలుచుకుంది.. ఆ తర్వాత టైటిల్ గెలవలేదని చెప్పాడు. గత మూడేళ్లలో రోహిత్ 300 కంటే తక్కువ పరుగులు చేశాడు. బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా విజయాలు ఇవ్వలేకలేకపోయాడని రోహిత్‌ని తప్పించారంటూ ఉతప్ప చెప్పుకొచ్చాడు.