198 రన్స్ టార్గెట్.. మొదటి వికెట్ కోల్పోయిన గుజరాత్

by Javid Pasha |
198 రన్స్ టార్గెట్.. మొదటి వికెట్ కోల్పోయిన గుజరాత్
X

దిశ, వెబ్ డెస్క్: 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఓపెనర్ వృద్ధిమాన్ (12) సాహా జట్టు స్కోర్ 25 వద్ద సిరాజ్ బౌలింగ్ లో దొరికిపోయాడు. దీంతో గుజరాత్ స్కోర్ మందగించింది. ప్రస్తుతం శుభమన్ గిల్, విజయ్ శంకర్ క్రీజులో ఉన్నారు. ఇక అంతకు ముందు టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 197 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇక గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2, షమీ, దయాల్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

కాగా ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకున్న గుజరాత్ కి ఇది నామమాత్రపు మ్యాచ్ మాత్రమే. ఇక గుజరాత్ తో పాటు చెన్నయ్, లక్నో జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ముంబై , బెంగళూరు జట్లు పోటీ పడుతున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే ముంబై, ఆర్సీబీ జట్లలో నెట్ రన్ రేట్ ఎక్కువ ఉన్న జట్టు ప్లే ఆఫ్ కు క్వాలిఫై అవుతుంది.

Advertisement

Next Story