తీవ్ర ఉత్కంఠ పోరులో ముంబై విజయం.. జైస్వాల్ సెంచరీ వృథా

by Mahesh |
తీవ్ర ఉత్కంఠ పోరులో ముంబై విజయం.. జైస్వాల్ సెంచరీ వృథా
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఘన విజయం సాధించింది. దీంతో రాజస్థాన్ యువ బ్యాటర్ జైస్వాల్ సెంచరీ వృథా అయింది. కాగా ఈ మ్యాచ్‌లో మొదట్ టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో.. జైస్వాల్..128, రాణించడంతో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబై జట్టుకు రెండో ఓవర్లోనే రోహిత్ అవుట్ కావడంతో గట్టి షాక్ తగిలింది. అనంతరం కిషన్ 28, గ్రీన్ 44, సూర్యకుమార్ యాదవ్ 55, తిలక్ వర్మ 29 టీమ్ డేవిడ్ 45 రాణించారు. ముఖ్యంగా చివరి ఓవర్లో టీమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి మరో 3 బంతులు మిగిలి ఉండగానే ముంబై జట్టుకు విజయాన్ని అందించాడు.

Advertisement

Next Story