ముంబై ఘన విజయం.. RCB ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు..

by Mahesh |
ముంబై ఘన విజయం.. RCB ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్ రేసులో కీలక మ్యాచులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన ముంబై, బెంగళూర్ మ్యాచ్‌లో MI ఈజీగా గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవగా.. బౌలర్ల ఫెలవమైన ఆటతీరుతో గెలవాల్సిన మ్యాచ్‌ను బెంగళూరు చెజేతులారా ఓడిపొయింది. కాగా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో డుప్లేసిస్ 65, మ్యాక్స్‌వెల్ 68, దినేష్ కార్తిక్ 30, తో రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఓపెనర కిషన్ 42, ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 83, నేహాల్ వదేరా 52, పరుగులతో రాణించడంతో 4 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే 200 పరుగులను చేసి ముంబై జట్టు విజయం సాధించింది. ఈ ఓటమితో RCB జట్టు ప్లే ఆఫ్ వెళ్లెందుకు ఉన్న మార్గాలు అన్ని చాలా కఠినంగా మారాయి.

Advertisement

Next Story