సూర్యకుమార్ యాదవ్ డకౌట్.. ఐపీఎల్‌లో బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్

by GSrikanth |
సూర్యకుమార్ యాదవ్ డకౌట్.. ఐపీఎల్‌లో బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు ఎట్టకేలకు ఐపీఎల్‌లో విజయం సాధించింది. ఆదివారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై బోణీ కొట్టింది. స‌మిష్టి ప్రద‌ర్శన‌తో పంత్ సేన‌పై 29 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టులో రోహిత్ శ‌ర్మ(49), ఇషాన్ కిషన్(42), హార్దిక్ పాండ్యా(39), టిమ్ డెవిడ్(45), షెఫార్డ్(39) చెల‌రేగి కొండంత స్కోర్ అందించారు. మొత్తంగా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. భారీ ఛేద‌న‌లో ఢిల్లీ బ్యాటర్స్ ట్రిస్టన్ స్టబ్స్(71), విధ్వంస‌క‌ ఓపెన‌ర్ పృథ్వీ షా(66)లు హాఫ్ సెంచ‌రీలతో పోరాడినా జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయారు. ఓవరాల్‌గా ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబైని విజయం వరించింది. కాగా, ఈ సీజన్‌లో తొలి మ్యా్చ్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కావడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.

Advertisement

Next Story