ఐపీఎల్-17కు రికార్డు టీవీ వ్యూయర్‌షిప్

by Harish |
ఐపీఎల్-17కు రికార్డు టీవీ వ్యూయర్‌షిప్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 రసవత్తరంగా సాగుతోంది. టీవీల్లోనూ, మొబైల్‌లోనూ కోట్లలో మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. ఈ సీజన్‌లో తొలి 10 మ్యాచ్‌లను టీవీల్లో 35 కోట్ల మంది చూశారు. గత ఎడిషన్లతో పోలిస్తే ఇదే అత్యధికం. ఐపీఎల్ టీవీ బ్రాడ్‌కాస్టర్ డీస్నీ స్టార్ విడుదల చేసిన బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆ‌ర్‌సీ) డాటా ప్రకారం.. తొలి 10 మ్యాచ్‌లను టీవీల్లో 35 కోట్ల మంది వీక్షించగా.. 8,028 కోట్ల నిమిషాలుగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 20 శాతం పెంపు. చెన్నయ్, బెంగళూరు జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్‌‌ను 16.8 కోట్ల మంది చూడగా.. 1,276 కోట్ల నిమిషాలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ సేపు వీక్షించిన ఓపెనింగ్ మ్యాచ్‌గా రికార్డు నమోదు చేసింది. డిజిటల్‌లోనూ ఓపెనింగ్ మ్యాచ్ వ్యూయర్‌షిప్ గత గణాంకాలను అధిగమించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed