- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే మూడు సీజన్లలోనూ డబ్ల్యూపీఎల్‌లో ఐదు జట్లే.. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్
న్యూఢిల్లీ : వచ్చే మూడేళ్లపాటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను ఐదు జట్లతోనే నిర్వహించనున్నట్టు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపాడు. మార్చిలో జరిగిన డబ్ల్యూపీఎల్ ప్రారంభ సీజన్‌ను బీసీసీఐ విజయవంతంగా నిర్వహించింది. దాంతో ఐపీఎల్‌లాగా డబ్ల్యూపీఎల్‌లోనూ జట్లను పెంచే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడిన అరుణ్ ధుమాల్.. పలు విషయాలు వెల్లడించాడు. ‘డబ్ల్యూపీఎల్‌కు గొప్ప ప్రారంభం దక్కింది. భవిష్యత్తులో లీగ్ మరింత మెరుగ్గా ఉంటుంది. ఐదు జట్లతో లీగ్‌ను ప్రారంభించాం.
జట్లను పెంచే ఆలోచన ఉన్నది. కానీ, వచ్చే మూడేళ్లపాటు ఐదు జట్లతో లీగ్ కొనసాగుతుంది. ఆటగాళ్ల సమూహం బట్టి జట్లను పెంచేందుకు ఆస్కారం ఉంటుంది.’ అని చెప్పాడు. అలాగే, జట్లకు అభిమానులను మరింత దగ్గర చేసేందుకు ఇంటా, బయట పద్ధతిలో లీగ్ నిర్వహించాలనుకుంటున్నామని తెలిపాడు. డబ్ల్యూపీఎల్ తొలి టైటిల్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.