IPL 2023: 'గిల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు'.. సచిన్‌ ట్వీట్‌ వైరల్‌

by Vinod kumar |
IPL 2023: గిల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.. సచిన్‌ ట్వీట్‌ వైరల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఆర్సీబీతో తన లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్‌ ఆడిన గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుత విజయంతో టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ముంబై ఇండియన్స్‌ మెంటార్‌ సచిన్‌ టెండుల్కర్‌ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘కామెరాన్‌ గ్రీన్‌, శుబ్‌మన్‌ గిల్‌ ముంబై ఇండియన్స్‌ కోసం అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు.

ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లి వరుస సెంచరీలతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ప్రతి ఒక్కరు తమ క్లాస్‌ బ్యాటింగ్‌తో అలరించారు. ముంబై ప్లే ఆఫ్స్‌ చేరినందుకు సంతోషంగా ఉంది. 'గో ముంబై'.. అంటూ సెంచరీ వీరులపై ప్రశంసలు కురిపించాడు. తమ జట్టుకు పరోక్షంగా సాయం చేసిన గిల్‌కు థాంక్స్‌ చెప్పచెప్పకనే చెప్పాడు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ముంబై స్టార్‌ కామెరాన్‌ గ్రీన్‌ సుడిగాలి సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed