- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టిన జాబితాలో రింకూ సింగ్..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా రింకూ సింగ్ నిలిచాడు. చివరి ఓవర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయానికి 29 పరుగులు అవసరం కాగా, రింకూ సింగ్ ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి టార్గెట్‌ను పూర్తి చేశాడు.
అయితే ఐపీఎల్‌లో తొలిసారిగా 5 సిక్సర్లు కొట్టింది.. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్. ఐపీఎల్ 2012లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నప్పుడు పుణే వారియర్స్‌పై గేల్ మొదటిసారిగా ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదాడు. పుణే బౌలర్ రాహుల్ శర్మ బౌలింగ్‌లో గేల్ ఈ ఫీట్ సాధించాడు.
IPLలో ఒక ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితా..
1. క్రిస్ గేల్ (RCB) vs రాహుల్ శర్మ (పుణె వారియర్స్), బెంగళూరు, 2012.
2. రాహుల్ తెవాటియా (రాజస్తాన్ రాయల్స్) Vs షెల్డన్ కాట్రెల్ (పంజాబ్ కింగ్స్), షార్జా, 2020.
3. రవీంద్ర జడేజా (CSK) vs హర్షల్ పటేల్ (RCB), ముంబై WS, 2021.
4. మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్ (LSG) Vs శివమ్ మావి (కేకేఆర్), పుణే, 2022.
5. రింకూ సింగ్ (KKR) vs యష్ దయాళ్ (గుజరాత్ టైటాన్స్), అహ్మదాబాద్, 2023.