రాజస్థాన్ పై పంజాబ్ విజయం..

by Mahesh |
రాజస్థాన్ పై పంజాబ్ విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో బుధవారం గౌహతిలో పంజాబ్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మొదట టాస్ ఓడిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ ధావన్, ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ చెలరేగి ఆడటంతో భారీ స్కోర్ చేశారు. అనంతరం 198 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టుకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు ఓడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో PBKS వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. IPL సీజన్‌లో PBKS తమ మొదటి రెండు మ్యాచ్‌లలో విజయాలు నమోదు చేయడం ఇది మూడోసారి.

Advertisement

Next Story

Most Viewed