- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: 'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ధోనికి అంతగా సూట్ కాదు'.. సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తూ తన వ్యూహాలతో ప్రత్యర్థులను ముప్పుతిప్పులు పెడుతున్న చెన్నై కెప్టెన్ ధోనిపై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనికి ఇదే చివరి సీజన్..? అని ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ విశ్లేషకుల మధ్య చర్చోపచర్చలు సాగుతున్న వేళ.. చెన్నై సారథి ఐపీఎల్ ఫైనల్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ సీజన్‌లో బీసీసీఐ ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ద్వారా తర్వాతి సీజన్‌లో ధోనిని ఆడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీని ద్వారా ధోని కేవలం బ్యాటింగ్ చేస్తే సరిపోతుందని.. వికెట్ కీపర్‌గా మరో ప్లేయర్‌కి ఛాన్స్ ఇస్తే ధోనికి ఏ ఇబ్బందీ ఉండదని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం మరోలా స్పందించాడు.
"ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ధోనికి అంతగా సూట్ కాదని.. అతడు కెప్టెన్‌గా ఉంటేనే చెన్నైకి మేలని అభిప్రాయపడ్డాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అనేది బౌలర్, బ్యాటర్‌లకు వర్తిస్తుందన్నాడు". ధోని ఈ సీజన్‌లో ఎక్కువగా ఆఖరి రెండు ఓవర్లు ఉండగానే బ్యాటింగ్‌కు వచ్చాడు. గట్టిగా లెక్కబెడితే ఈ సీజన్లో అతడు ఎదుర్కున్న బంతులు 50 కంటే మించి ఉండవు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ధోనికి పనికిరాదని చెప్పుకొచ్చాడు. "ధోనీ 20 ఓవర్లు కచ్చితంగా క్రీజులో ఉండాలి. కెప్టెన్ కానప్పుడు ధోని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి మాత్రం ఏం ఉపయోగం. అలాంటి సందర్భాల్లో ధోని చెన్నైకు మెంటార్ లేదా కోచ్ గానో సేవలందిస్తే బెటర్".. అని వీరూ అభిప్రాయపడ్డాడు.