- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: విఫలమైన పంజాబ్ బ్యాటర్లు.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. మొదట్లో మాథ్యూ షార్ట్ (22 బంతుల్లో 36, 6 ఫోర్లు, 1 సిక్సర్), చివర్లో షారుక్ ఖాన్ (9 బంతుల్లో22, 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న గుజరాత్ టైటాన్స్‌తో ఈ స్కోరును డిఫెండ్ చేయాలంటే పంజాబ్ బౌలర్లు ఏదైనా మ్యాజిక్ చేయాల్సిందే. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా డకౌట్ అయ్యాడు. మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే మిడ్ వికెట్ వద్ద ఉన్న రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
స్కోరు బోర్డుపై పరుగులేమీ చేయకుండానే పంజాబ్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది. జితేశ్ శర్మ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సామ్ కరన్ (22 బంతుల్లో 22, 1 ఫోర్, 1 సిక్సర్).. భానుక తో కలిసి ఐదో వికెట్ కు 27 బంతుల్లో 23 రన్స్ జోడించాడు. రాజపక్స నిష్క్రమించిన తర్వాత షారుక్ ఖాన్ వచ్చీ రాగానే రెండు సిక్సర్లు కొట్టి మెరుపులు మెరిపించాడు. కానీ మోహిత్ శర్మ వేసిన 19వ ఓవర్లో తొలి బంతికే కరన్ ఔటయ్యాడు. ఆ ఓవర్లో షారుక్ ఓ ఫోర్ కొట్లాడు. జోషువా లిటిల్ వేసిన చివరి ఓవర్లో హర్‌ప్రీత్ బ్రర్ ఓ సిక్సర్ బాదగా షారుక్ రనౌట్ అయ్యాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శ్మ రెండు వికెట్లు తీయగా మిగిలిన బౌలర్లు (షమీ, లిటిల్, అల్జారీ, రషీద్ ఖాన్) లు తలా ఒక వికెట్ తీశారు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 13, 2023
Vital contributions from the middle order powered @PunjabKingsIPL to 153/8 💪@gujarat_titans put up a solid show with the ball 👌👌
The #GT chase to begin soon!
Scorecard ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/aAF3E8T6Tt