- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇవ్వని గంగూలీ.. బయటపడ్డ విభేదాలు
బెంగళూరు: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం అప్పట్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అప్పుడు కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పరోక్షంగా గంగూలీపై విమర్శలు చేయగా.. దాదా సైతం కౌంటర్ ఇచ్చాడు. శనివారం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, గంగూలీ మధ్య విభేదాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గంగూలీ టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో బౌలర్ సిరాజ్ వేసిన ఓవర్‌లో ఢిల్లీ ఆటగాడు అమన్ హకీమ్ ఖాన్ భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద కోహ్లీకి చిక్కాడు.
క్యాచ్ పట్టిన కోహ్లీ.. ఢిల్లీ డగౌట్ వద్ద కూర్చున్న గంగూలీ వైపు సీరియస్ లుక్ ఇచ్చాడు. గంగూలీ కూడా కోహ్లీ వైపు కోపంగానే చూశాడు. ఇదంతా వీడియాలో స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు 23 పరుగుల తేడాతో గెలుపొందింది. అనంతరం మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో వీరిద్దరు మరోసారి ఎదురుపడ్డారు. కోహ్లీ పాంటింగ్‌తో మాట్లాడుతుండగా.. గంగూలీ పాంటింగ్‌ను దాటేసి ముందుకు వెళ్లి ఇతర ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరలవ్వగా.. ‘కోహ్లీ, గంగూలీ మధ్య ఇంకా విభేదాలు అలాగే ఉన్నాయి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని అన్‌ఫాలో చేయడం గమనార్హం.