IPL 2023 : ఐపీఎల్ ట్రోఫీకి ప్రత్యేక పూజలు..

by Vinod kumar |
IPL 2023 : ఐపీఎల్ ట్రోఫీకి ప్రత్యేక పూజలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ నిలిచిన సంగతి తెలిసిందే. మంగళవారం సీఎస్కే మేనేజ్‌మెంట్.. టైటిల్‌‌ను తీసుకుని చెన్నైలో టీటీడీ నిర్మించిన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రోఫీని ఆ దేవదేవుడి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేయించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా హీరో ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది.

దీంతో ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జట్టుగా ముంబై రికార్డును సమం చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై అద్భుతమైన విజయం సాధించడంతో తొలిసారి కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాడు. విన్నింగ్ రన్స్ చేసిన జడేజాను గాల్లోకి ఎత్తుకొని సంతోషంతో కన్నీరు పెట్టుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌తో రిటైర్‌మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

Advertisement

Next Story