వారికి ఇది నా రెండో హెచ్చరిక.. వినకుంటే కెప్టెన్‌గా తప్పుకుంటా: MS ధోని

by Mahesh |
వారికి ఇది నా రెండో హెచ్చరిక.. వినకుంటే కెప్టెన్‌గా తప్పుకుంటా: MS ధోని
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై కెప్టెన్ ధోని సీరియస్ అయ్యారు. ఒకే మ్యాచ్‌లో అత్యధికంగా వైడ్లు, నో-బాల్స్ వేయడంతో దోని బౌలర్లను హెచ్చరించాడు. ఇది వారికి నా రెండో హెచ్చరిక.. మళ్లీ అలాగే అదుపుతప్పి బౌలింగ్ చేస్తే నేను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటా.. అప్పుడు బౌలర్లు కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో ఆడాల్సి వస్తుంది. అని ధోని చెప్పుకొచ్చాడు. దీంతో CSK అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో వారంతా CSK బౌలర్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

Advertisement

Next Story