- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెరుపు వేగంతో గిల్ ను స్టంపౌట్ చేసిన ధోని.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సెహ్వాగ్
దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ చెన్నయ్ సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే గుజరాత్ తరఫును ఓపెనర్లు సాహా, గిల్ క్రీజులోకి వచ్చారు. ఇక సెంచరీల మీద సెంచరీలు కొడుతూ ఫుల్ ఫామ్ లో ఉన్న గిల్.. ఈ ఫైనల్ మ్యాచ్ లోనూ దూకుడుగానే ఆట మొదలుపెట్టాడు. అయితే గిల్ తన వ్యక్తిగత స్కోర్ 39 వద్ద జడేజా బౌలింగ్ లో కీపర్ ధోని చేతిలో స్టంపౌట్ అయ్యాడు. ఇక రెప్పపాటు సమయంలో డేంజరస్ బ్యాటర్ గిల్ ను ధోని స్టంపౌట్ చేసిన తీరుకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.
ఇండియన్ క్రికెట్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ధోనిపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘వావ్.. బ్యాంకుల నుంచి బ్యాంకు నోట్లను మార్చుకోవచ్చు. కానీ వికెట్ల వెనుక ఉండే ధోనిని మాత్రం ఎవరూ మార్చలేరు. మళ్లీ ఎప్పట్లాగే మెరుపు వేగంతో అవుట్ చేసిన ధోని’’ అంటూ సెహ్వాగ్ కామెంట్ చేశారు.