ఐపీఎల్ 2024 లో ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్, ముంబై స్టేడియంలో అనుమానిత బుకీలు అరెస్ట్

by Mahesh |
ఐపీఎల్ 2024 లో ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్, ముంబై స్టేడియంలో అనుమానిత బుకీలు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఎన్నికలు వాతావరణం ఉన్నప్పటికీ ఐపీఎల్ 2024 మాత్రం గ్రౌండ్ ఫుల్ కలెక్షన్లతో జోరుగా సాగుతోంది. అట్టహాసంగా ప్రారంభమైన ఈ 17 సీజన్ లో రికార్డుల మోత మోగింది. ఇదిలా ఉంటే.. పలు మ్యాచ్‌లు ఫిక్సింగ్ అయ్యాయనే అనుమానం తలెత్తింది. తాజాగా.. రాజస్థాన్ రాయల్స్ హోమ్ స్టేడియం మార్చి 28 ఢిల్లీతో రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఇద్దరు అనుమానిత బుకీలను, అలాగే ముంబైలోని వాంఖడే స్టేడియంలో మరో ఇద్దరిని, మొత్తం నలుగురిని.. ఫిక్సింగ్ కి పాల్పడుతున్నారనే అనుమానంతో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం అరెస్ట్ చేసింది.

బుకీలను విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌ల ద్వారా లాభాలను ఆర్జించడానికి పిచ్-స్లైడింగ్ అని పిలువబడే ప్రత్యక్ష ప్రసారం నుండి వచ్చే సమయ లాగ్‌ను తగ్గించుకోవడానికి బుకీలు దీన్ని ఉపయోగిస్తున్నారు. కాగా సంఘటన చాలా ఆందోళనలను లేవనెత్తుతుంది. ముందుగా, లగ్జరీ బాక్సులకు పాస్‌లు ఎలా కేటాయించబడుతున్నాయి? పోలీసుల విచారణలో తేలిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Advertisement

Next Story