ఇవాళే ఐపీఎల్‌లో రసవత్తర మ్యాచ్.. వర్షం ఉందా?

by GSrikanth |
ఇవాళే ఐపీఎల్‌లో రసవత్తర మ్యాచ్.. వర్షం ఉందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-14లో భాగంగా ఇవాళ అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. సెమీ ఫైనల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా ఉండటంతో సెమీ ఫైనల్ పోరు భీకరంగా ఉండబోతుందని క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పిచ్ బ్యాటర్లకు అనుకూలించేలా ఉండటం.. ఇరు జట్ల బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండటంతో ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయమని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా, హైదరాబాద్, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈరోజు వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉంది. వాతావరణ శాఖ ప్రకారం అహ్మదాబాద్ వాతావరణం ఆహ్లాదకరంగా, ఎండగా ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో నేడు అభిమానులు KKR, హైదరాబాద్ థ్రిల్లింగ్ మ్యాచ్‌ని ఆస్వాదించవచ్చని వెదర్ రిపోర్ట్ అధికారులు తెలిపారు. అయితే తేమ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో కొంత మంచు ప్రభావం ఉంటుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed