చెన్నయ్ అలవోకగా.. కోల్‌కతాకు తొలి ఓటమి

by Harish |
చెన్నయ్ అలవోకగా.. కోల్‌కతాకు తొలి ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి దూకుడు కనబర్చిన ఆ జట్టు.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి వెనుకబడిన విషయం తెలిసిందే. కోల్‌కతాపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెన్నయ్ మళ్లీ గెలుపు బాట పట్టింది. సోమవారం చెన్నయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు, ఈ సీజన్‌లో కోల్‌కతా తొలి పరాజయాన్ని పొందింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 137/9 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(34) టాప్ స్కోరర్. జడేజా(3/18) సత్తాచాటాడు. అతనికితోడు తుషార్ దేశ్‌పాండే(3/33), ముస్తాఫిజుర్(2/22) మెరవడంతో కోల్‌కతా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అనంతరం 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నయ్ అలవోకగా ఛేదించింది. 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(67 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తాచాటి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Advertisement

Next Story