షురూ.. ఐపీఎల్(IPL) ఫ్యాన్స్‌కు బీసీసీఐ శుభవార్త

by GSrikanth |
షురూ.. ఐపీఎల్(IPL) ఫ్యాన్స్‌కు బీసీసీఐ శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు ఉన్న క్రేజ్ సపరేట్‌. టీ20, వన్డే వరల్డ్ కప్‌‌ల తర్వాత అందరూ ఎదురుచూసేది ఐపీఎల్‌ కోసమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా.. ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఐపీఎల్-2024 వేలం డిసెంబర్ 19వ తేదీన జరుపనున్నట్లు తెలిపింది. దుబాయ్ వేదికగా ఈ ఆక్షన్ నిర్వహించనున్నట్లు శుక్రవారం అధికారింగా ప్రకటించారు. కాగా, ఈనెల 26వ తేదీలోగా ఫ్రాంచైజీలు తమ వద్ద ఉన్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల పర్స్‌ను రూ.100 కోట్లకు చేర్చారు. అత్యధికంగా పంజాబ్ కింగ్స్ వద్ద రూ.12. 55 కోట్ల పర్స్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వద్ద రూ.6.55 కోట్లు ఉన్నాయని BCCI పేర్కొంది.

Advertisement

Next Story