- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఓటమి తర్వాత తప్పుకోవాలనుకున్నా.. రోహిత్ వల్లే ఆగాను : ద్రవిడ్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించి ఘనంగా ముగింపు పలికాడు. అయితే, గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాతే అతను కోచ్‌గా తప్పుకోవాలనుకున్నాడట. కెప్టెన్ రోహిత్ ఆపడంతో కంటిన్యూ అయ్యాడట. ఈ విషయాన్ని స్వయంగా ద్రవిడే వెల్లడించాడు. అప్పుడు రోహిత్ ఆపడంతోనే టీ20 ప్రపంచకప్ విజయంలో తాను భాగమయ్యానని తెలిపాడు. తాజాగా టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూంలో ద్రవిడ్ ఆఖరిసారిగా మాట్లాడాడు.
ఈ సందర్భంగా ద్రవిడ్.. రోహిత్ కాల్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘థాంక్యూ రోహిత్. నవంబర్‌లో నువ్వు నాకు కాల్ చేశావు. కొనసాగాలని అడిగావు.’ అని తెలిపాడు. జట్టుతో అనుబంధం గురించి మాట్లాడుతూ..‘నాకు మాటలు రావడం లేదు. అపరూప జ్ఞాపకంలో నన్ను భాగం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇది పరుగుల గురించో, వికెట్ల గురించో కాదు. కెరీర్‌ను మీరు గుర్తుపెట్టుకోకపోవచ్చు. కానీ, ఇలాంటి జ్ఞాపకాలే ఎప్పటికీ నిలిచిపోతాయి. మనం సాధించిన దాన్ని చూసి దేశం మొత్తం గర్వపడుతుంది. మీ అందరితో కలిసి పని చేసినందుకు అదృష్టంగా, ఆనందంగా ఉంది.’ అని చెప్పుకొచ్చాడు.