- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరికాసేపట్లో T-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. అభిమానుల్లో టెన్షన్ టెన్షన్..!
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న టీ-20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. టీ-20 వరల్డ్ కప్ టైటిల్ కోసం టీమిండియా, సౌతాఫ్రికా ఫైనల్ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇవాళ రాత్రి 8 గంటలకు వెస్టిండీస్‌లోని బ్రిడ్జిటౌన్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్న వేళ క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఫ్యాన్స్ టెన్షన్‌కు కారణం వర్షమే. ఫైనల్ మ్యాచ్ జరగనున్న బ్రిడ్జిటౌన్‌లో 70 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, వర్షం వల్ల ఇవాళ మ్యాచ్ జరగకపోయిన ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. వర్షం కారణంగా ఇవాళ మ్యాచ్ నిర్వహణ సాధ్యంకాకపోతే రేపు (ఆదివారం) మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఒకవేళ వర్షం వల్ల రేపు కూడా మ్యాచ్ జరగపోతే ఫైనల్ చేరిన ఇండియా, సౌతాఫ్రికా ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.