- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అంతలోనే...
దిశ, నవీపేట్ : దుబాయ్ వెళ్లేందుకు ఓ యువకుడు సిద్ధమవుతుండగా అంతలోనే విధి వంచించింది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మండలంలోని జగ్గారావు ఫారం సమీపంలో బాసర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ (ఎం) గ్రామానికి చెందిన యువకుడు నరేష్ (26) మృతి చెందాడు.
నవీపేట్ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు అబ్బాపూర్ (ఎం) గ్రామానికి చెందిన నరేష్ దుబాయ్ వెళ్లడానికి వీసా రావడంతో ఏజెంట్ కు కట్టాల్సిన మిగతా డబ్బులను నిజామాబాద్ లోని తన స్నేహితుడిని అడిగేందుకు శుక్రవారం మధ్యాహ్నం వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని జంతువు అడ్డు వచ్చింది. దాంతో అదుపుతప్పిన బైక్ రోడ్డు డివైడర్ ను ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా 108లో జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలిస్తుండగా చనిపోయాడని, మృతుని భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కె. వినయ్ తెలిపారు.
- Tags
- young man died