- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తల్లి మృతిని తట్టుకోలేక ఆత్మహత్య
దిశ, పాపన్నపేట : మనస్థాపంతో ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్మాల్ మండలంలోని బోడగట్టు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్మాల్ మండలం బోడగట్టుకు చెందిన కందిపల్లి మల్లేశం కూతురు కందిపల్లి చందు (14) తల్లి నింగమని తొమ్మిది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది.
దీంతో అప్పటి నుండి తల్లి గురించి బాధపడుతూ మనస్థాపం చెందూతూ ఉండేది. దాంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తరువాత ఇంట్లోకి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
- Tags
- suicide