- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక యువకుడు సూసైడ్.. కోరిక తీర్చలేనన్నా వదల్లే..
దిశ, వెబ్‌డెస్క్: కాలేజీ డేస్‌లో యువతీయువకులు ప్రేమించుకోవడం కామన్. అయితే ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి చేసుకుంటున్నారా..? లేదా అన్నది అప్రస్తుతం. కానీ ప్రేమ పేరిట హద్దులు దాటడం.. వేధింపులకు గురి చేయడం.. అఘాయిత్యాలకు పాల్పడటం నేరం. ఇప్పటి వరకు అమ్మాయిలపై అబ్బాయిలు వేధింపులకు పాల్పడటం చూశాం. కానీ ఓ యువతి రివర్స్‌లో తన ప్రియుడికి టార్చర్ చూపించింది. ఆమె వేధింపులు భరించలేని అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో బుధవారం ఉదయం జరిగింది. మృతుడి బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
గాజువాకలోని శ్రీనివాసనగర్‌కు చెందిన కోసన్ భాస్కర్ రావు (బాబీ) స్థానికంగా ఉన్న ఏవీకే డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతడికి నీట్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి తిరిగారు. తాజాగా ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని భాస్కర్ రావు కోరింది. దానికి అతడు అంగీకరించలేదు. దీంతో తనను పెళ్లి చేసుకోకపోతే అట్రాసిటీ కేసు పెడతానని ఆ యువతి బెదిరించింది. భయపడిపోయిన భాస్కర్ రావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణంతో కన్నీరు మున్నీరు అయిన తల్లిదండ్రులు సదరు యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకోవాలని తన కుమారుడిని టార్చర్ పెట్టిందని, ఆమె కోరిక తీర్చనందుకే బెదిరింపులకు పాల్పడిందని, భాస్కర్ రావు మృతికి ప్రియురాలే కారణమని గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.