ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ కు పాముకాటు

by Sridhar Babu |
ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ కు పాముకాటు
X

దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ లో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ కు పాము కాటువేసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దేవాపూర్ ఫ్యాక్టరీలో నవీన్, వైభవ్ అనే వ్యక్తులు సెక్యూరిటీ గార్డ్స్ గా పని చేస్తున్నారు. కంపెనీ క్వార్టర్లలో వీరు ఇద్దరూ నివసిస్తున్నారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున పాము కాటు వేసింది. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

మార్గమధ్యలో నవీన్ (25) మృతి చెందాడు. వైభవ్ ను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు. నవీన్ తిర్యాణి మండలవాసి కాగా వైభవ్ మహారాష్ట్రకు చెందిన వాడు. నవీన్ మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. పాము కాటుతో మృతి చెందిన నవీన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని దేవాపూర్ ఫ్యాక్టరీ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి దేవాపూర్ కంపెనీ అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. ఉద్యోగం విషయంలో అధికారులతో కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed