- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యువతిని బెదిరించాలని ప్రయత్నించి....చివరకు...
దిశ, మంగపేట : ప్రేమ వ్యవహారంలో అమ్మాయిని బెదిరించాలనే ఉద్దేశంతో క్షణికావేశానికి గురైన యువకుడు ఆళ్ల జయంత్(21) గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని మల్లూరులో సోమవారం చోటు చేసుకోగా వైద్యం పొందుతూ యువకుడు బుధవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్లూరు ఆళ్ల శ్రీను, సరిత దంపతుల కుమారుడు జయంత్
వ్యవసాయంలో తండ్రికి చేదోడువాదోడుగా జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతిని కొంత కాలంగా ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటానని మిత్రులతో అంటున్నట్లు తెలిపారు. వన్ సైడ్ ప్రేమ వ్యవహారంలో యువతి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమెను బెదిరించాలనే రాఖీ పండుగ రోజు గడ్డి మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు జయంత్ ను ఏటూరునాగారం, వరంగల్ ప్రేవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా బుధవారం మృతి చెందినట్లు తెలిపారు.
- Tags
- suicide