- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
Trending: సెల్ఫీ వీడియో మోజులో యువకుడి ప్రాణాలు బలి.. ఏకంగా నల్లతాచును నోట్లో పెట్టుకుని
దిశ, ప్రతినిధి నిజామాబాద్: యువతలో సెల్ఫీ వీడియోల మోజు రోజురోజుకు తారా స్థాయికి చేరుతోంది. ఓవర్ నైట్లో పాపులారిటీ సంపాదించాలనే యావలో ప్రాణాలను సైతం ఏమాత్రం లెక్క చేయటం లేదు. కావాలని చేస్తున్నారో.. నాకు ఏం కాదులే అనే ధైర్యంతో చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. వద్దని వారించాల్సిన బంధువులు, స్నేహితులు సైతం ప్రోత్సహిస్తుండటంతో రెచ్చిపోయి సెల్ఫీ వీడియోల కోసం డేర్ చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో అచ్చం అలాంటి ఘటనే గురువారం చోటుచేసుకుంది. పోచారం కాలనీలోని డబుల్ బెడ్రూం కాలనా సముదాయంలో నివాసముండే మోచి శివరాజ్ (20) అనే యువకుడు పాములను పట్టి జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలోనే గురువారం సుమారు 2 మీటర్ల పొడువు ఉన్న అత్యంత ప్రమాదకరమైన విష నాగును పట్టుకుని సెల్ఫీ వీడియో కోసం పాము తలను నోట్లో పెట్టుకున్నాడు. అయితే, ఆ పాము కోపంతో నోట్లోనే విషం చిమ్మడంతో శివరాజ్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఈ ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.