- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్టీసీ బస్సులో హసీస్ ఆయిల్ తరలింపు
దిశ, మల్కాజిగిరి : ఆర్టీసీ బస్సు ద్వారా హాసీస్ ఆయిల్ తరలిస్తున్న అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఏజెన్సీ ప్రాంతం నుండి ఆర్టీసీ బస్సు ద్వారా 10.2 కేజీల హాసీస్ ఆయిల్ ను తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ ఓ టీ భవనగరి, పోచంపల్లి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. కేసు వివరాలను మంగళవారం నేరేడ్ మెట్ సీపీ కార్యాలయంలో వెల్లడించారు. నిందితుల వద్ధ నుంచి రూ. 1.52 కోట్ల విలువైన హసీస్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు గమ్మెలి గోవిందరావు, కొర్ర రాంబాబు ఇద్దరూ స్నేహితులు.
వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యవసాయ కూలీలు. ఇరువురు సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారంలోకి దిగారు. హసీస్ ఆయిల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని తెలిసిన వ్యక్తుల నుండి సేకరించి అవసరమైన వినియోగదారులకు వీరే విక్రయిస్తున్నారు. గోవిందరావు, రాంబాబులు చంటి, లక్ష్మి నాయుడు నుంచి 10.2 కిలోల ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించాలని ప్లాన్ చేసి కొత్తగూడ ఎక్స్ రోడ్స్ వద్ద ఆర్టీసీ బస్సు నుండి దిగుతుండగా ఎస్‌ఓటీ, భోవనగిరి జోన్ బృందం పోచంపల్లి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద అక్కడి పోలీసులతో కలిసి 10.2 కేజీల హసీస్ ఆయిల్‌ను, వారి వద్ధ నుంచి రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చంటి , లక్ష్మీనాయుడులను పట్టుకునేందుకు యత్నిస్తునట్లు తెలిపారు. కేజీ ఈ ఆయిల్ తయారీకి సుమారుగా 35 నుంచి 40 కేజీల గంజాయిని ఉపయోగిస్తున్నారని, మొత్తం 10.2 కేజీల హసీస్ ఆయిల్ కు సుమారు 450 కేజీల గంజాయిని వినియోగించినట్లు తెలిపారు.
- Tags
- Drug gang