మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి

by Shiva |
మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి
X

దిశ, మిడ్జిల్: విద్యుత్ షాక్‌తో రైతు దుర్మరణం పాలైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని వసుపుల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బి.శ్రీశైలం (36) సోమవారం సాయంత్రం తన పొలం పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్ పోయింది. దీంతో విద్యుత్‌కు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులకు ఎలాంటి సమాచారం అందించకుండా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒంటరిగా వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి ఫ్యూజ్ వేసేందుకు ప్రయత్నించాడు. అయితే, అప్పటికి టాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరా జరగుతుండటంతో అది ముట్టుకోగానే శ్రీశైలం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో రాత్రి 7 గంటల తరవాత పొలానికి వెళ్లిన తోటి రైతులకు శ్రీశైలం మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఏఈని వివరణ కోరగా.. లైన్‌మెన్‌కు సమచారం లేకుండా.. ఎల్సీ తీసుకోకుండా శ్రీశైలం ఫ్యూజ్ వేసేందుకు వెళ్లాడని.. అందుక ఈ ఘటన జరిగిందని ఏఈ అన్నారు. కాగా, మృతుడికి భార్య సంధ్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed