పొచ్చెర వాగులో ముగ్గురు యువకుల గల్లంతు

by Aamani |
పొచ్చెర వాగులో ముగ్గురు యువకుల గల్లంతు
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్ మండలంలో గల పొచ్చర వాగులో మంగళవారం ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆదిలాబాద్ డీఎస్పీఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రెస్క్యూ బృందం గల్లంతైన యువకుల కోసం గాలించింది. ఈ క్రమంలో గల్లంతైన ముగ్గురు యువకులు మృతదేహాలను వెలికి తీశారు. దీంతో ఆ గ్రామం వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన నాగల్ వార్ విజయ్ 28, ఆకాష్ 26 ,అక్షయ్ 22 ,ముగ్గురు అన్నదమ్ములు ఆదిలాబాద్ జిల్లాకు పని కోసం వచ్చారని తెలిపారు.

తాంసి మండలంలోని కప్పర్ల లో తన మేనబావ అయినా కాంబ్లే శ్రీనివాస్ తో బండల్ నాగాపూర్ గ్రామానికి వచ్చిన వారు మధ్యలో మధ్యాహ్నం సమయంలో పొచ్చర వాగు దగ్గరికి వచ్చి ముగ్గురు అన్నదమ్ములు చేపలు పట్టేందుకు నదిలోకి దిగారని అన్నారు. ఈ క్రమంలో తన తమ్ముడు అక్షయ్ ముందుగా నీటిలోకి దిగగా ఆయన మునిగిపోతుంటే తమ్ముడిని కాపాడబోయి ఇద్దరు అన్న తమ్ములైన విజయ్,ఆకాష్ కూడా వాగులోకి దిగగా ముగ్గురు కూడా గల్లంతయ్యారని పేర్కొన్నారు.స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రెస్క్యూ టీం ద్వారా మృతదేహాల కోసం గాలించి వెలికి తీసారని వారు తెలిపారు.మృతుల తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అనంతరం మృతదేహాలను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని పోస్ట్ మార్టం కు తరలించినట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed