Accident : ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ముగ్గురు మృతి

by Sridhar Babu |
Accident : ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ముగ్గురు మృతి
X

దిశ,సత్తుపల్లి : ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొని బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సత్తుపల్లి మండల పరిధిలోని రామ గోవిందాపురం గ్రామానికి చెందిన బేతి సురేష్ ( 25), ముత్తిన వేణు (18), కరిముల్లా (12) ముగ్గురు గురువారం సాయంత్రం గంగారం రింగ్ సెంటర్ నుంచి అశ్వరావుపేట రోడ్డు రామ గోవిందాపురం గ్రామానికి వెళ్తున్న తరుణంలో గంగారం గ్రామంలో పాత

హెచ్​పీ పెట్రోల్ బంక్ ఎదురు రోడ్లో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. దాంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందటంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం బంధువులకు అప్పగించనున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా షేక్ కరిముల్లా స్థానిక దాసరి వీరారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు.

Advertisement

Next Story