ఈ దొంగకు పల్సర్ బైక్ అంటే మహా ఇష్టం .. ఆశ్చర్యానికి గురైన పోలీసులు

by Disha Web Desk 23 |
ఈ దొంగకు  పల్సర్ బైక్ అంటే మహా ఇష్టం .. ఆశ్చర్యానికి  గురైన పోలీసులు
X

దిశ, క్రైమ్ బ్యూరో : పల్సర్ బైక్ యజమానులకు రాచకొండ పోలీసులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ దొంగను పట్టుకున్నప్పుడు వెలుగు చూసిన చోరీ వైనాన్ని బట్టి పల్సర్ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

పల్సర్ బైక్ కు రీ సెల్ డిమాండ్ అందుకే..

హీరో హోండా, ఇంకా ఇతర బైక్ లను దొంగతనం చేస్తే వాటికి గిరాకీ తక్కువగా ఉంటుండడం, ధర తక్కువగా రావడం తో వాటిని చోరీ చేసిన గిట్టు బాటు అవడం లేదట. పల్సర్ బైక్ కు డిమాండ్ ఉందని గుర్తించి ఇప్పుడు ద్విచక్ర వాహన దొంగలు ఆ బైక్ లనే టార్గెట్ చేసారని పోలీసులకు కొత్త విషయం తెలిసింది...

ఈ పల్సర్ బైక్ లు తాళం వేసిన వాటిని ఒక్క కాలితో గట్టిగా బిగిసి పట్టి చేతితో మరో వైపు లాగితే సెకండ్ లో బైక్ తాళం విరిగిపోతుందని పట్టుబడ్డ దొంగ పోలీసు లకు వివరించాడు. అంతే కాకుండా చోరీ చేసిన తర్వాత పారిపోయేటప్పుడు ఎవరికీ చిక్కకుండా పారిపోవచ్చని ధైర్యం ఉంటుందని పోలీసు లను ఆశ్చర్యానికి గురి చేసింది. మిగతా బైక్ అంతా వేగంగా వెళ్ళవన్నీ పట్టుబడే ఛాన్స్ లు ఎక్కువగా ఉంటాయని ఆ దొంగ పోలీసులకు చెప్పాడు. అంతే కాకుండా పల్సర్ బైక్ 150, 180 సీసీ ల ధర లక్ష పైన ఉండడం తో దానిని పత్రాలను తర్వాత ఇస్తామని 40 వేలకు అమ్మడం చాలా తేలిక అని దొరికిన దొంగ చెప్పడం పోలీస్ లను షాక్ కు గురిచేసింది..

ఫేస్ బుక్ దోస్తీ...

ఆంధ్రప్రదేశ్ కు చెందిన మల్లె భారత్ కుమార్ కు ఫేస్ బుక్ లో కిట్టు పరిచయం అయ్యాడు. అతను భరత్ కుమార్ కు తనకు పల్సర్ బైక్ కొనడానికి పార్టీ రెడీగా ఉందని కలర్ చెప్పగానే భరత్ ఆ రంగు బైక్ ని చోరీ చేసి వాటిని కిట్టు కి అప్ప చెప్పుతాడు. ఆ తర్వాత కిట్టు ఆ బైక్ ను అమ్మి వచ్చిన నగదును ఇద్దరు పంచుకుంటారు. ఇలా భరత్ గత ఏడాది డిసెంబర్ నెలలో కడప జైలు నుంచి విడుదల అయ్యి హైదరాబాద్ కు మూడు నెలలో 18 లక్షలు విలువ చేసే 18 పల్సర్ బైక్ లను మెట్రో స్టేషన్ పార్కింగ్, ఇతర రద్దీ ప్రాంతాల నుంచి కొట్టేశాడు. పల్సర్ బైక్ చోరీ ఫిర్యాదులు పెరగడం రాచకొండ ఎల్బీ నగర్ డీఐ సుధాకర్ పల్సర్ బైక్ దొంగ భరత్ కుమార్, రిసీవర్ కిట్టు ను అరెస్టు చేసి పల్సర్ బైక్ ల చోరీ భాగోతాన్ని 2 రోజుల కిందట బయట పెట్టారు.

మీ బైక్ లకు డబల్ లాక్ సిస్టం పెట్టుకోండి : సుధాకర్, డీఐ ఎల్బీ నగర్, రాచకొండ

మీ బైక్ లకు పాత రకం తాళలు ఉంటే వాటిని మార్చండి. బైక్ లను నిర్లక్ష్యంగా పార్కింగ్ చేయకండి. బైక్ లకు డబల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోండి. తాళాలను బైక్ కు వదిలేసి వెళ్ళకండి.


Next Story

Most Viewed