నిలిపి ఉంచిన కార్ల టైర్లు చోరీ

by Sridhar Babu |
నిలిపి ఉంచిన కార్ల టైర్లు చోరీ
X

దిశ, నిజాంపేట : పార్క్ చేసిన కార్ల టైర్లను దొంగిలించిన సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చేర్విరాల సురేష్, పంజా మహేందర్, గడ్డం శ్రీనివాస్ ల కార్ల మొత్తం 8 టైర్లు చోరీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ ఇండ్ల వద్ద కార్లు నిలిపేందుకు పార్కింగ్ లేక గాంధీ విగ్రహం సమీపంలో,

అలాగే ప్రధాన రహదారి పక్కన పెట్టుకోవాల్సి వచ్చిందని, ఎప్పటిలాగే ఉదయం వాహనాల వద్దకు వచ్చి చూసేసరికి నిలిపి ఉన్న కార్ టైర్ల స్థానంలో రాళ్లు ఉంచి టైర్లను ఎత్తుకెళ్లారని తెలిపారు. గుర్తుతెలియని దొంగలు దొంగతనానికి పాల్పడడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి క్లూస్ టీం ద్వారా పరిశీలించి దర్యాప్తు చేపడుతున్నట్లు ఏఎస్ఐ జైపాల్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed