దేవాలయాల్లో దొంగతనం..నిందితుల అరెస్టు

by Aamani |
దేవాలయాల్లో దొంగతనం..నిందితుల అరెస్టు
X

దిశ, చిన్నకోడూరు : దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ మధు తెలిపిన వివరాల ప్రకారం... కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బోదాసు యాదగిరి, కొమిరె శ్రీనివాస్, దూల్మిట్ట మండలానికి చెందిన వల్లేపు శేఖర్ ప్రస్తుత నివాసం ఇందిరమ్మ కాలనీ ముగ్గురు ముఠాగా ఏర్పడి దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. చిన్న కోడూరు మండల పరిధి రామునిపట్ల గ్రామ శివారులో వాహన తనిఖీ చేస్తున్న క్రమంలో ఇబ్రహీంనగర్ నుంచి సిద్దిపేట వైపు టీవీఎస్ ఎక్సెల్ పై వస్తున్న బోదాసు యాదగిరి, వల్లేపు శేఖర్ లు పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు పట్టుకుని విచారించగా దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నిందితులు కమిషనరేట్ పరిధిలో త్రీ టౌన్, టూటౌన్, రాజగోపాల్ పేట, దుబ్బాక, కోహెడ, మద్దూరు, చేర్యాల, గజ్వేల్, హుస్నాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని 20 దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుల వద్ద 5.5 తులాల పుస్తె మట్టెలు, 20 తులాల వెండి కిరీటం, శ్రీ చక్రం, 2 మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ అంజయ్య, చిన్నకోడూరు ఎస్ ఐ బాలకృష్ణ, రాజ గోపాలపేట ఎస్ఐ అసిఫ్, సిసిఎస్ సిబ్బంది, పోలీస్ సిబ్బందిని, ఎసీపీ మధు అభినందించారు. వీరి పేర్లను రివార్డ్ ప్రపోజల్ కోసం సీపీ అనురాధకు పంపిస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed