పనిచేసే చోటే కన్నం వేసిన ఘనుడు..

by Disha Web Desk 23 |
పనిచేసే చోటే కన్నం వేసిన ఘనుడు..
X

దిశ,జనగామ: జనగామ గవర్నమెంట్ ఆసుపత్రి లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ ఆసుపత్రి లోని టీవీ ని దొంగిలించిన నిందితున్ని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జనగామ పట్టణం రాజీవ్ నగర్ కు చెందిన గండి అఖిల్ తండ్రి గండి నాగరాజు, వయసు 27 సంవత్సరాలు అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు. సెక్యూరిటీ గార్డుగా పని చేయడం వలన తన కుటుంబ పోషణకు సరిపోక పోవడం వలన ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దొంగతనం చేయాలని నిర్ణయించుకుని తాను సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న జనగామ జిల్లా ఆసుపత్రి లో సమ్ సాంగ్ టీవీ ని దొంగిలించగా జనగామ పోలీస్ లకు గండి అఖిల్ పైన అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లి విచారించగా తాను దొంగతనం చేశాడని ఒప్పుకున్నారు అని తెలిపారు. వెంటనే అతనిని జనగామ ఇన్స్పెక్టర్ ఎల్. రఘుపతి రెడ్డి అరెస్టు చేసి ఈరోజు రిమాండ్ చేయనైనది.



Next Story

Most Viewed