- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్లి వచ్చిన మహిళ మృత్యువాత
దిశ, లోకేశ్వరం : కూలి పనికి వచ్చిన మహిళ కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్లి వచ్చి మృతి చెందిన ఘటన లోకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దుర్గా నగర్ తండాకు చెందిన రాపని లక్ష్మి (32) గురువారం రాయపూర్ కాండ్లి శివారులో బండరాయి కొట్టడానికి కూలి పనికి వెళ్లింది.
ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి తిరిగి రాగా నోటిలో నుండి నురగలు రావడంతో వెంటనే అక్కడ ఉన్నవారు చికిత్స కోసం బైంసాకు తరలించగా మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందిందని తెలిపారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన సమయంలో విష కీటకం కాటు వేయవచ్చని, లేక అనారోగ్య సమస్యలతో చనిపోయిందో తెలియదని మృతురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- Tags
- woman died