- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మద్యం మత్తులో యువకుల వీరంగం
దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలోని కొండాపూర్ లో యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది. మంగళవారం రాత్రి గణేష్ మండపం సమీపంలో మద్యం, గంజాయి సేవించి ఆ మత్తులో కత్తులు, కర్రలతో రెండు గ్రూపులు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని కొండాపూర్ లో గల హిందూ జై గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులపై మండపం వద్దనే చందూ పహిల్వాన్, రణదీప్ తో పాటు మరికొందరు వ్యక్తులు మరో వర్గంపై దాడికి తెగబడ్డారు.
పాత గొడవల కారణంగానే ఈ గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. దాడికి పాల్పడ్డ వారు బంజారాహిల్స్ కు చెందిన చందు పహిల్వాన్, రణదీప్ గా గుర్తించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, ఫిర్యాదు అందిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.
- Tags
- youth quarrel