- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kidnapping : కిడ్నాపైన బాలిక సురక్షితం
దిశ, కొత్తూరు : గురువారం సాయంత్రం కొత్తూర్ మండల కేంద్రంలో జరిగిన ఎనిమిదేండ్ల బాలిక అపహరణ కథ సుఖాంతం అయ్యింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంజయ్ సింగ్, సుమిత్రా సింగ్ దంపతుల కూతురు కాజల్ సింగ్ (8) గురువారం సాయంత్రం తోటి చిన్నారులతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి బాలికను అపహరించాడు. స్థానికులతో ఈ సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ నరసింహారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేశారు. దీంతో శంషాబాద్ ఏసీపీ కె.శ్రీనివాసరావు అర్థరాత్రి
ఘటనా స్థలానికి చేరుకుని సందర్శించారు. అనంతంరం బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి విచారణ చేపట్టారు. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పాటై పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరంగా చేపట్టారు. కానీ బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు తన కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందో యేమో కానీ శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో బాలికను రోడ్డుపై విడిచి వెళ్లిపోయాడు. ఆ చిన్నారి ఇంటికి చేరుకోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. బాలిక ఆచూకీ కోసం నిరంతరం శ్రమించిన పోలీసులను అందరూ అభినందించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Kidnapping