మహిళ వద్ద డబ్బులు తీసుకున్న కానిస్టేబుల్.. అడిగినందుకు ఆఫీసర్ ఏం చేశాడంటే..?

by Rajesh |
మహిళ వద్ద డబ్బులు తీసుకున్న కానిస్టేబుల్.. అడిగినందుకు ఆఫీసర్ ఏం చేశాడంటే..?
X

దిశ, నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రుద్రూర్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చిన ఓ మహిళ‌ను ఓ అధికారి బెదిరించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రుద్రూర్ సర్కిల్ పరిధిలోని ఓ మేజర్ గ్రామానికి చెందిన మహిళ సమీప పోలీస్ స్టేషన్ పక్కనే నివాసం ఉంటుంది. సదరు మహిళతో అదే పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న మహిళ కానిస్టేబుల్ పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం తో సదరు మహిళ వద్ద సుమారు రూ.లక్షలను అవసరాల నిమిత్తం 15 నెలల క్రితం తీసుకుని పూచి కత్తును సైతం సదరు మహిళ పోలీసు రాసి ఇచ్చింది.

ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ సదరు కానిస్టేబుల్ బదిలీపై మరో పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. ఇచ్చిన డబ్బులు ఆడిగేందుకు బాధిత మహిళ కానిస్టేబుల్ ఆచూకీ కోసం వెతికి జాడ తెలుసుకున్న అనంతరం డబ్బులు ఇవ్వాలని అడగడానికి వెళ్లడంతో నేను కానిస్టేబుల్ ను నన్నే డబ్బులు అడుగుతావా నీ అంతు చూస్తా అంటూ బెదిరించింది. నిన్ను కేసుల్లో ఇరికిస్తాను అని భయభ్రాంతులకు గురిచేసిందని బాధిత మహిళ ఆరోపించింది. ఇదే విషయమై జిల్లా పోలీసు కమిషనర్‌ను కలిసి సమస్యను విన్నవించింది. దానితో పోలీస్ కమిషనర్ స్పందించి బోధన్ ఏసీపీకి సిపార్సు చేయడంతో బాధిత మహిళ న్యాయం కోసం బోధన్ ఏసీపీని కలిసి బాధను వెళ్లగక్కింది.

వెంటనే స్పందించిన ఏసీపీ సదరు మహిళ కానిస్టేబుల్‌ను పిలిపించి డబ్బులు ఇవ్వాలని అందుకు సంబంధించిన ఆధారాలు చూపించడంతో ఇప్పుడు నాదగ్గర డబ్బులు లేవని ముందుగా చెప్పిన కానిస్టేబుల్ తిరిగి రుద్రూర్ కు చేరుకుని మహిళ వద్దకు వెళ్ళిందని బాధిత మహిళ పేర్కొన్నారు. ఈ విషయమై విచారణ చేపట్టాలని బోధన్ ఏసీపీ సదరు పోలీస్ అధికారి కి ఆదేశించారు. విచారణ కోసం పిలిచిన సదరు పోలీస్ తనను బెదిరించి ఉన్నతాధికారుల వద్దకు ఎందుకు వెళ్లావ్ అంటూ బెదరించినట్లు తెలిపింది.

సదరు మహిళా పోలీస్ వద్ద తీసుకున్న ఐడీ కార్డు ఇవ్వాలని బెదిరించినట్లు పేర్కొంది. డబ్బులు ఇప్పట్లో ఇవ్వదు మరో ఒప్పంద పత్రం ను రాసి ఇస్తుందని తెలిపినట్లు వాపోయింది. సుమారు 5 నెలల వరకు ఆగాలని నీకు గతంలో రాసి ఇచ్చిన పత్రం చెల్లు బాటు కాదని సదరు మహిళను ఆ పోలీస్ అధికారి బెదిరించి నట్లు బాధిత మహిళ ఆరోపించింది. న్యాయం కోసం వెళ్తే సదరు పోలీస్ నన్నే దబాయించి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను సైతం ఆచరించకుండా బాధితుల పక్షాన నిలబడాల్సిన అధికారి అన్యాయం చేసిన వారికి కొమ్ము కాస్తూ బాధితుల పట్ల దురుసుగా మాట్లాడదమేంటని పలువురు చర్చించు కుంటున్నారు. ఈ విషయమై తాను డీజీపీని కలిసి సదరు పోలీస్ అధికారిపై ఫిర్యాదు చేస్తానని బాధిత మహిళ సదరు మహిళ పోలీసు పేర్కొంది.

Advertisement

Next Story