- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల పార్వేటి మండపం వద్ద ఏనుగుల హల్‌చల్
by Shiva |
X
దిశ, తిరుమల: తిరుమలలో ఏనుగులు హల్ చల్ సృష్టించాయి. వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన పార్వేటి మండపం వద్దకు ఆదివారం వేకువజామున వచ్చిన ఏనుగులు పరిసర ప్రాంతాలలో కలియతిరిగాయి. పార్వేటి మండపం వద్ద గల ఎర్రచందనం వద్దగల కంచెలను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాయి. ఐదేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఎర్ర చందనం, శ్రీగంధం చెట్లను టీటీడీ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏపుగా పెరుగుతున్న మొక్కలను ఏనుగులు ధ్వంసం చేశాయి. విషయం తెలుసుకున్న టీటీడీ ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగులు సంచరించిన ప్రాంతాన్ని వాటి కాలిముద్రల ఆధారంగా గుర్తించారు. మొత్తం ఏడు ఏనుగులు దాడికి పాల్పడినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఏనుగు సంచారంపై నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story