crime news : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

by Sumithra |
crime news : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
X

దిశ, మిర్యాలగూడ (దామరచర్ల) : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన దామరచర్ల మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం దామరచర్ల మండల కేంద్రానికి చెందిన కంచరకుంట్ల రమణారెడ్డి (39) మంగళవారం కుటుంబ ఆర్థిక విషయాలలో భార్యతో గొడవపడి ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పెద్దమ్మ కొడుకు చిట్యాల మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు. కాగా మృతుని తల పై గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed