వైసీపీ నేతపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. వెనక్కి తీసుకోవాలని మహిళకు బెదిరింపులు

by Nagaya |
వైసీపీ నేతపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. వెనక్కి తీసుకోవాలని మహిళకు బెదిరింపులు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కర రావుపై గోపాలపట్నం పోలీసు స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ప్రభుత్వ స్థలాన్ని ఒక మహిళ ఆక్రమించి మొక్కలు నాటిందని, ఆ సమయంలో గ్రామాభ్యదయ సంఘం సభ్యులు ఆమె ఫొటోలు తీసి వాట్సప్ గ్రూప్‌లలో పెట్టి పరువు తీశారన్నది అభియోగం. అయితే, మహిళ అనుమతి లేకుండా ఫొటోలు తీసి వైరల్ చేసిన బెహరా అనుచరుడిపై కేసు నమోదైన సందర్భంలో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెహరా బెదిరించారని తెలిసింది. దానిపై మహిళ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.ఏది ఏమైనా అధికార పార్టీ నేతపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed