పేకాట స్థావరాల పై పోలీసుల దాడి

by Sumithra |
పేకాట స్థావరాల పై పోలీసుల దాడి
X

దిశ, తాడ్వాయి : పేకాట స్థావరాల పై తాడ్వాయి పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందంతో కలిసి దాడులు చేశారు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఎర్రపహాడ్ గ్రామంలో బుధవారం సాయంత్రం పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరాల పై దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిలో ఏనుగు జైపాల్ రెడ్డి, బద్దం మల్లారెడ్డి, బద్దం బాల్ రెడ్డి, జూకంటి గంగారెడ్డి, జలంధర్ రెడ్డి, వర్కంతం రాజిరెడ్డి, కృష్ణమూర్తి మెహవత్ సోపాన్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ,58,670 నగదు, 8 మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story