గణేష్ నిమజ్జనంలో అపశృతి.. ఒకరు మృతి

by Sumithra |
గణేష్ నిమజ్జనంలో అపశృతి.. ఒకరు మృతి
X

దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ మండలం పరిధిలో గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం తాండ గ్రామా మాజీ సర్పంచ్ మంగ్య నాయక్ తన ఇంట్లో గణేష్ విగ్రహానికి ఏర్పాటు చేశాడు. శనివారం అర్ధరాత్రి అదే గ్రామంలోని చెరువులో గణేశుని నిమజ్జనాన్ని చేస్తున్న సమయంలో గ్రామానికి చెందిన కే.సురేందర్ (28) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story