- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంగడికి వెళ్తుండగా అనంతలోకాలకు
దిశ, కామారెడ్డి : కామారెడ్డికి కూరగాయలు తీసుకురావడానికి సంతకు (అంగడి) మోటార్ సైకిల్ పై స్నేహితునితో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. దేవునిపల్లి పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కుమ్మరి రాజశేఖర్ (30) అనే యువకుడు తన స్నేహితుడు రాజుతో కలిసి వ్యవసాయ పొలం నుంచి కూరగాయలు తీసుకురావడానికి కామారెడ్డికి బయలు దేరారు.
క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై నిజామాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రాజశేఖర్ అక్కడికక్కడే మరణించాడు. కాగా మరొకరు అయిన రాజుకి గాయాలయ్యాయి. కాగా మృతుని తండ్రి చిన్నప్పుడే చనిపోగా కుటుంబ బాధ్యతలు ఇతనిపైనే పడ్డాయి. అయితే ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- road accident