- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దారుణం.. ముసుగులు వేసుకుని వచ్చి సినిమా స్టైల్‌లో మర్డర్
దిశ, వెల్గటూర్ : జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల విషయంలో ఓ కుటుబంపై ముసుగు దొంగల మాదిరిగా దాడి చేసి ఒకరిని మర్డర్ చేశారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ఘటన సంచలనం రేపింది. బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన బెస్త శ్రీనివాస్ (35), అతని తమ్ముడు మహేష్‌పై రాడ్లు, పైప్‌లతో గురువారం అర్ధరాత్రి ముసుగు వేసుకున్న కొంతమంది దుండగులు దాడి చేయగా బెస్త శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్‌కు తీవ్ర గాయాలు కాగా ప్రాణాలతో పోరాడుతున్న అతన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో ఐదుగురు ముసుగు వేసుకుని వచ్చి రాడ్లు, పైప్‌లతో ఆటవికుల మాదిరిగా దారుణంగా కొట్టి చంపారని గ్రామస్థులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఇంటి పక్కనే ఉన్న స్థలం విషయంలో కొందరితో గొడవలు జరుగుతున్నాయి. భూ తగాదాల నేపథ్యంలోనే గొడవలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇరువర్గాలు సంయమనం పాటిస్తే పరిష్కారము అయ్యే సమస్యకు క్షణికావేశానికి లోనై కొట్టి చంపటం దుర్మార్గమైన చర్య అని గ్రామస్థులు అంటున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు. ధర్మపురి సిఐ రాం నరసింహ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.