మానసిక వేధనతో వివాహిత ఆత్మహత్య

by Sridhar Babu |
మానసిక వేధనతో వివాహిత ఆత్మహత్య
X

దిశ,చండూరు : మానసిక వేధనతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని తస్కనిగూడెం గ్రామానికి చెందిన పాలకూర ఇంద్రజ ( 23 )ను బాల రాజు అనే వ్యక్తితో 8 సంవత్సరాలు క్రితం వివాహమైంది. అయినా పిల్లలు కాకపోవటం, అలాగే ఒక సంవత్సరం నుండి తన భర్తతో దూరంగా ఉండటంతో కొద్ది రోజుల నుండి మానసికంగా బాధపడుతూ ఉండేది.

దాంతో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం నల్గొండ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుండి ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం మరణించింది. మృతురాలు తల్లి హన్మంతు బాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed